స్టార్ హీరోలంతా ఇపుడు భారీ బడ్జెట్ మూవీల పైనే దృష్టి కేంద్రీకరించారు. ఓ రేంజ్ లో కంటెంట్ ఉంటే తప్పితే సాదా సీదా స్టోరీల వైపు కనీసం చూపు కూడా వేయడం లేదు. అందరూ అగ్ర హీరోలు ఇదే బాట పడుతున్న నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో సినిమాకి సైన్ చేయడం మరో బిగ్గెస్ట్ న్యూస్ అయిపోయింది. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రతి పూట ఈ సినిమా విశేషాలు కోసం ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే డైరెక్టర్ శంకర్ తమ అంచనాలకు మించి ఈ సినిమాను అందిస్తారని నమ్మకం పెట్టుకున్నారు అభిమానులు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. చిరు క్లాప్ కొట్టి స్టార్ట్ చేసిన మూవీ షూటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మొదట చిరు క్లాప్ కొట్టి కనిపించగా ఆ తరవాత చెర్రీ ఒకే చెబుతూ హుందాగా ముందుకు నడుస్తుండగా మధ్యలో కియారా అద్వానీ తన చేయి పట్టుకుని చెర్రీతో కలసి నడిచింది. ఇక ఇపుడు మరో తాజా అప్డేట్ ఈ సినిమా అంచనాలను ఆకాశాన్ని దాటేలా చేస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్ చూస్తే వెనక భారీ జనం ఉండగా హీరో రామ్ చరణ్, హీరోయిన్ కీయారా అద్వానీ మరికొందరు సూటు బూటు వేసుకుని చేతిలో ఫైల్స్ పట్టుకుని ముందుకూ నడుస్తున్నారు. దీని చూసిన కొందరు ఇందులో రామ్ చరణ్ పెద్ద ఆఫీసర్ లా కనిపించనున్నారు అని అంటుండగా మరికొందరు బిజినెస్ మ్యాన్ గా నటించనున్నారని అంటున్నారు.

అయితే చెర్రీ పాత్ర పై మాత్రం అఫిషియల్ గా మాత్రం  ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఇపుడు మరో వార్త చరణ్ ఈ చిత్రంలో పెద్ద ఆఫీసర్ గానే కనిపించబోతున్నారు అనడానికి ఊతం ఇస్తోంది. ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి స్ట్రిక్ట్  ఆఫీసర్ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది. అయితే ప్రజల కు అండగా నిలబడిన మరో ఆఫీసర్ గా చరణ్ జనాల వైపు నిలబడుతారని చెబుతున్నారు. చిరు పాత్ర నిడివి చాలా తక్కువేనని వినికిడి. ఇంతకీ ఈ మూవీలో చిరు కనిపించనున్నారా అంటే అఫిషియల్ గా క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. మరి చరణ్ అడుగులు ఏ వైపుకు తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: