చిత్ర పరిశ్రమలో ఒక సినిమా విజయం సాధించడానికి హీరోలు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొన్ని కొన్ని సినిమాలైతే శ్రమకు మించి కష్టపడుతూ ఉంటారు మన హీరోలు. అయినా కూడా ఒక్కోసారి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ఫ్యాన్స్ తో పాటూ హీరోలను కూడా నిరాశపరుస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మృగరాజు' సినిమా కూడా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు జోడిగా సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, నాగబాబు, సంఘవి, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

దేవి ఫిలిమ్స్ బ్యానర్ పై దేవి వరప్రసాద్ అప్పట్లోనే ఏకంగా 15 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు. యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సింహంతో పోరాడవలసి ఉంటుంది. ఇందుకోసమే సినిమాలో సన్నివేశాలు రియాలిటీ గా ఉండాలని అప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జాక్ అనే సింహాన్ని 67 లక్షల రూపాయలను ఖర్చుచేసి రప్పించారు. సుమారు 26 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది ఆ సింహం. ఇక దర్శక నిర్మాతలు అనుకున్నట్టుగానే రియల్ సింహానికి, చిరంజీవికి మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు.ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా రోజుకు 20 గంటలు చొప్పున తీవ్రంగా కష్టపడ్డారు.

ఇక ఈ సినిమా పై చిత్ర బృందం మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయినప్పటికీ కూడా విడుదల తర్వాత ఈ సినిమా ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది. భారీ అంచనాల నడుమ 2001వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాభవాన్ని చవిచూసింది.అంతేకాదు ఈ సినిమా ద్వారా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందరికంటే ఈ సినిమా ద్వారా నిర్మాత మాత్రం చాలా నష్టపోయాడు. చిత్ర యూనిట్తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమా కోసం ఎన్నో గంటల తరబడి శ్రమించారు. అయినా కూడా చివరికి ఈ సినిమా కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం అందించలేదనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: