నేటి ప్రపంచంలో ప్రతి విషయం వింతగా , అలాగే విశేషంగా కనిపిస్తుంటాయి. ఇక సినీ సెలబ్రిటీలకు చెందిన లవ్ ఎఫైర్ విషయాలు ఎన్నో సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపించడం ఇప్పుడు సర్వసాధారణ విషయం అయిపోయింది. మరి ఈ క్రమంలో సినీ సెలబ్రిటీల గురించి ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా ఏకంగా కొందరు ఏవేవో కథలు అల్లి తప్పుడు ప్రచారాలు చేయడం సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తున్నాము. అయితే తాజాగా ఇలాంటి ఒక వార్త వినిపిస్తోంది. ఓ టాలీవుడ్ సినీ హీరో లవ్ ఎఫైర్ వార్తలు గడిచిన రెండు రోజుల నుండి సామాజిక మాధ్యమాలలో తెగ హల్చల్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న హీరోగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

అయితే ఇటీవలే వైజాగ్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కూతురుతో ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ హీరో ఇప్పటికే 12కు పైగా సినిమాలలో నటించారు. దీనితో సినీ పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు హీరోయిన్లతో కూడా ఆ హీరోకి  లవ్ ఎఫైర్లు ఉన్నట్లు కూడా అప్పట్లో చాలా కథనాలే వినిపించాయి. కాగా తాజాగా ఈ బిజినెస్ మెన్ డాటర్ తో లవ్ గురించి ఆమె ఇంట్లో తెలిసిపోవటంతో మొదట పెళ్ళికి ఒప్పుకోక పోయినప్పటికీ ఆ తర్వాత రెండు కుటుంబాలు మాట్లాడుకొని వారి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే వారి పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో ఈ హీరో మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలియడంతో  వారి మద్య తరచూ గొడవలు వస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆ హీరో తనని కనుక పెళ్లి చేసుకోకుండా తనకి అన్యాయం చేస్తే..  మాత్రం అతనిని కచ్చితంగా మీడియా ముందుకు లాగి రచ్చ రచ్చ చేస్తానని బెదిరిస్తోందట. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త సినిమా ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనితో ఆ హీరోకి మరీ సన్నిహితంగా ఉన్న ఓ ప్రముఖ సినీ నిర్మాత ఈ విషయంలో కలగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పారట.. ఇక నుండి అయినా ఆ హీరో వేరే అమ్మాయిల జోలికి పోకుండా కామ్ గా ఉంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: