ఇక ఈ మద్య కాలంలో సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా అత్యధికంగా ప్రచారం జరుగుతున్న సినిమాల్లో కన్నడ సినిమా '777 చార్లీ' ఒకటి అనడంలో అసలు ఎలాంటి సందేహం అనేది లేదు.గుండెలను బాగా పిండేసేంతటి సెంటిమెంట్ తో ఈ సినిమా ఉందంటూ టాక్ బాగా వినిపిస్తుంది. కన్నడంలో ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా కూడా పెద్ద చర్చ జరుగుతోంది.కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. కాని ప్రమోషన్ సరిగా చేయక పోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్ల విషయంలో ఈ సినిమా సత్తా చాటలేక పోయింది. కాని సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 777 చార్లీ ఓటీటీ లో వస్తుంది.. ఎప్పుడు చూడాలి అంటూ ఎదురు చూస్తున్నారు.ఇక ఓటీటీ లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందని అంతా కూడా భావించారు.


కాని యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఓటీటీ విడుదల చేసేందుకు చాలా సమయం అనేది ఉందట. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం కాకుండా ఎనిమిది వారాల తర్వాత లేదా రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ సూపర్ సెన్షేషన్ మూవీని వెంటనే ఓటీటీ లో చూడాలి అనుకుంటున్న వారికి అయితే ఇది బ్యాడ్ న్యూస్. కాని ఈ సినిమా కు ఖచ్చితంగా ముందు ముందు మంచి భారీ వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఇప్పటిదాకా అయితే ఈ సినిమాకి 40 కోట్లు వసూళ్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: