ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు క్రికెట్లో సత్తా చాటుతూ ఉంటే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా పాపులర్ అయిందంటే చాలు ఆ సినిమాకు సంబంధించి పలు రిల్ వీడియోలు చేస్తూ ఉంటారు. అలా తెలుగు ప్రేక్షకులకు మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చా. ఇక ఐపీఎల్ లో సన్రైజర్స్ తరఫున హైదరాబాద్ కి కెప్టెన్ గా ఉన్నారు. ఆ సమయంలోనే తెలుగు సినిమాల పైన మక్కువ ఏర్పడిందట డేవిడ్ వార్నర్ కు.



అయితే ఇప్పుడు తాజాగా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అలా షేర్ చేసిన ఆ వీడియో కొన్ని సెకన్లలోనే చాలా పాపులర్ అయింది. అలా పాపులర్ కావడానికి ముఖ్య కారణం ఇటీవలే జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు భారీ స్థాయిలో అవార్డు లభించాయి. ఇక ఈ వార్త తెలిసిన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా పుష్ప చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ.. ఒక వీడియోని షేర్ చేశారు.

ఫిలింఫేర్ అవార్డు అందుకున్న పుష్ప టీం కి ముఖ్యంగా అల్లు అర్జున్ నటన అంటే నాకు చాలా ఇష్టమని రాసుకోవచ్చారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు వార్నర్. అంతేకాకుండా వార్నర్ పుష్ప సినిమా గెటప్ లో ఉన్న ఒక ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో క్రికెట్ ప్లేయర్లు కూడా సినిమాలు చూసి తమ హవాని కొనసాగిస్తూ ఉన్నారు. మరి పుష్ప-2 సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: