మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీvలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే క్రేజీ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ క్లోజ్ చేసింది. మరి ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ మూవీ జరుపుకోగా ... సీడెడ్ లో 15 కోట్లు ... యు ఏ  లో 10.2 కోట్లు ... ఈస్ట్ లో 6.50 కోట్లు ... వెస్ట్ లో 6 కోట్లు ... గుంటూరులో 7.50 కోట్లు ... కృష్ణ లో 5.6 కోట్లు ... నెల్లూరులో 3.2 కోట్లు మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక లో ఈ మూవీ కి 5 కోట్లు ... రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు ... ఓవర్సీస్ లో 9 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కి 88 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


సినిమా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. ఈ మూవీ కనుక ప్రపంచ వ్యాప్తంగా 89 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... రవితేజమూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. క్యాథరిన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ఊర్వశి రౌటేల ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: