టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2015 నుండి 17 వరకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్. దాని అనంతరం ఆ ఫామ్ ని రకుల్ ప్రీత్ సింగ్ కోల్పోయింది అని చెప్పాలి. మహేష్ బాబు సరసన నటించిన స్పైడర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని దక్కించుకుంది ఈమె. ఆ సినిమా తర్వాత నుండి స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలని కోల్పోయింది రకుల్ ప్రీత్ సింగ్. దాని అనంతరం ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం మళ్లీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది ఈ అమ్మడు. 

దాని తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఐయారీ అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈమె. బాలీవుడ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ పడి సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా సరైన హిట్టును అందుకోలేకపోయింది ఈమె. దీంతో ప్రస్తుతం రకుల్ చూపంత దక్షిణాదిపైనే ఉంది. హిందీలో నటిస్తున్నప్పటికీ మంచి విజయాన్ని అందుకోకపోవడంతో మళ్లీ దక్షిణాదిలో రియంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈమె తమిళంలో కమలహాసన్ శంకర్  కాంబినేషన్లో రానున్న ఇండియన్ టు సినిమాల్లో నటిస్తోంది. దీంతోపాటు శివ కార్తికేయన్ అయలన్ వంటి సినిమాల్లో సైతం నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే భారీ అంచనాలను పెట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

 ఇక కమలహాసన్ తో చేస్తున్న ఇండియన్ టు సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది.శివ కార్తికే ఎంతో చేయనున్న సినిమా కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక మీడియాతో ముచ్చట ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో భాగంగానే కమల్ హాసన్ పై ప్రశంసలు వర్షం కురిపించింది. ఇందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 సినిమాల్లో నటించడం చాలా ఆనందంగా ఉంది అంతేకాదు కమలహాసన్ ఓ విశ్వవిద్యాలయం అనే కమలహాసన్తో నటించడం తన అదృష్టమని వందేళ్ళ సినిమాలో 60 ఏళ్లుగా ఆయన ఉన్నారని చెప్పుకొచ్చింది రకుల్. కమలహాసన్ విషయంలో ఈ సినిమా పెద్ద రికార్డు అని చెప్పుకొచ్చింది.అంతేకాదు కమలహాసన్ అడ్డదారిలో విజయాలు రావని తెలియజేసిన నటుడు అని మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధతో పాటు పనిని నిబద్ధతతో చేస్తే ఖచ్చితంగా విజయం దొరుకుతుంది అని కమల్ హాసన్ తెలియజేశారు అని చెప్పకు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: