ది ప్యారడైజ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి, ప్రతి అప్‌డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ పెంచుతుంది. ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నేచురల్ స్టార్ నాని 'జడల్' గా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంలోని ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ వెటరన్ స్టార్ మోహన్ బాబు 'శికంజ మాలిక్' గా ది ప్యారడైజ్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారని అనౌన్స్ చేశారు. ఇది సినిమాపై బజ్ ని మరింతగా పెంచుతుంది.


దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా కాలం తర్వాత లెజెండరీ మోహన్ బాబును బిగ్ స్క్రీన్ పైకి తీసుకువస్తున్నారు. పవర్ ఫుల్ విలన్ గా చూపిస్తున్నారు. ఈ పాత్ర విన్న వెంటనే మోహన్‌బాబు గారిని అద్భుతంగా ఆకట్టుకుంది, వెంటనే అంగీకరించారు. తన కోసం రాసిన పాత్ర విన్న తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అభిమానిగా మారిపోయారు. ఆయన లుక్ సినిమా థీమ్‌కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. ఆయన ఐకానిక్ చారిస్మా‌ను మరింత హైలైట్ చేస్తోంది.


పవర్, ఇంటెన్సిటీ, స్టైల్‌తో క్రాఫ్ట్ చేసిన ఈ పాత్రలో మోహన్‌బాబు గారి ప్రత్యేకతైన పంచ్ డైలాగ్స్, మానరిజమ్స్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండబోతున్నాయి. ‘డైలాగ్ కింగ్’ ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన మెస్మరైజ్ చేయబోతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ది ప్యారడైజ్ ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే పాన్-వరల్డ్ స్పెక్టకిల్‌గా నిలవనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: