ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు టీవీ షోలో మరోవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. తాజాగా సార్ సినిమా ట్రైలర్ లో కూడా హైపర్ ఆది మెడిసాడు. మరోవైపు జనసేన తరఫున ప్రచారం కూడా చేస్తున్నాడు హైపర్ ఆది. ఇదిలావుంటే ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది ఎమ్మెల్యే గా కూడా పోటీ చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చాడు హైపర్ ఆది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేయడం గురించి కూడా మాట్లాడాడు.

 ఇక ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేయడం గురించి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాడు. అంతేకాదు ఆర్పి కి తనకి మధ్య కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని.. మా ఇద్దరి మధ్య కళ్ళు రగిలి పళ్ళు నోరు ఎంత శత్రుత్వం లేదని.. కూడా చెప్పాడు. మేము ఫ్యాక్షనిస్టులం కాదని.. ఆర్టిస్టులమని పేర్కొన్నాడు హైపర్ ఆది. అంతే కదా వ్యక్తిగతంగా కెరియర్ మొదట్లో అర్పి అన్న నన్ను చాలా సపోర్ట్ చేశాడని కూడా చెప్పాడు. అంతేకాదు మణికొండలో ఆర్పీ పెట్టిన బ్రాంచ్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు హైపర్ ఆది. దాంతోపాటు ఆర్పీ చేపల పులుసు బాగా చేస్తాడని ఆర్పి కంటే బాగా ఎవరూ చేయలేరు అని చెప్పాడు.

అనంతరం పాలిటిక్స్ గురించి ఇక్కడ ప్రస్తావించను అని చెప్పడంతో హైపర్ ఆది చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైపర్ ఆది క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. దానికి తోడు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేశాడు హైపర్ ఆది. షో తో పని లేకుండా ప్రస్తుతం వరుస షోలు మరియు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం హైపర్ ఆది సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో జబర్దస్త్ కి కూడా ఇటీవల గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో హైపర్ ఆది తిరిగి జబర్దస్త్ కి వస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: