ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 వ సంవత్సరంలో విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి ఫాహాధ్ ఫజిల్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రావు రమేష్ , సునీల్ , అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ యొక్క రెండవ భాగం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి కూడా అయింది. ఇది ఇలా ఉంటే రేపు అనగా ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు అన్న విషయం మనకు తెలిసిందే. 

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మూవీ యూనిట్ పుష్ప పార్ట్ 2 మూవీ నుండి ఒక వీడియోను విడుదల చేయబోతుంది. ఈ వీడియోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ స్టిల్స్ లో ఎక్కువ శాతం సుకుమార్ హైలెట్ అయ్యారు. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: