బాలీవుడ్ లో ప్రముఖ నటుడు ఫృథ్వీరాజ్ కపూర్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.  ఆయన తనయులు రాజ్ కపూర్, షమ్మీకపూర్, రణదీర్ కపూర్ ఇలా వరుసగా హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  వారందరిలో రాజ్ కపూర్ బాలీవుడ్ లో ఎంతో గొప్ప  పేరు సంపాదించారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, సింగర్ ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు.  ఆయన తనయుడు రిషీ కపూర్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు.  తండ్రి రాజ్ కపూర్ యొక్క 1970 చిత్రం మేరా నామ్ జోకర్ (1970) లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినందుకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా  1973 లో ‘బాబీ’ చిత్రంతో నటించాడు.. ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ కపాడియా.  

IHG

అప్పట్లోనే హమ్ తుమ్ ఎక్ కమ్ రేమె బంద్ హో అనే పాట ఓ ట్రెండ్ సృష్టించింది.  బాబీ చిత్రంలో నటించినందుకు 1974 లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు. 1973 మరియు 2000 మధ్య 92 చిత్రాలలో రొమాంటిక్ లీడ్ గా ప్రధాన పాత్రలు పోషించాడు.. వాటిలో 36 బాక్స్ ఆఫీస్ హిట్స్.  దో డూని చార్ లో నటనకు, అతను 2011 లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకున్నాడు. 2017 లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

 

ఫిలింఫేర్ జీవితకాల సాధన అవార్డుతో సత్కరించారు.  తన సహనటి నీతు సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన తనయుడు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. రిషీ కపూర్ మరణంపై బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది.  నిన్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త మరువక ముందే రిషీ కపూర్ కన్నుమూయడం బాలీవుడ్ సెలబ్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: