బాలీవుడ్ లో హీరోయిన్ ల గురించి వారి అలవాట్ల గురించి తరచూ సామజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. వారి వారి అభిరుచికి తగినట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక భామకు యోగా పిచ్చి పట్టుకుందంట. అదేంటి యోగా పిచ్చి పట్టుకోవడం అనుకుంటున్నారా అయితే కింద ఇచ్చిన ఏపీ హెరాల్డ్ ఆర్టికల్ ను ఒకసారి చదవండి. వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమృతా అరోరా..అదేనండి మలైకా అరోరా సోదరి. బాలీవుడ్ లో సిస్టర్ల పరంపర కొనసాగుతూనే ఉంది...కంగనాకు రంగోలిలా...కరీనాకు కరిష్మాలా...ఇప్పుడు మన మలైకాకు అమృత అలా అన్నమాట...

ఇప్పుడు తాజాగా అమృతా అరోరా తన సోదరిని యోగిని లా అభివర్ణిస్తూ నెట్టింట్లో ఫోటోలతో రచ్చ చేస్తోంది. అంతేకాకుండా యోగా చేయడంలో తన సోదరి ఒక వ్యసనపరురాలని నెటిజన్లతో పంచుకుంది. కాగా ఈమె యోగా, జిమ్ మరియు మెడిటేషన్ చేయడం లో తనకు తానే సాటి అని వీక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం మలైకా అరోరా యోగా ఫీట్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అరోరా తన తాజా వ్యసనానికి ఫిట్నెస్ కనెక్షన్ ఉంది.ఈ ఫోటోలో మలైకా చాప మీద కూర్చుని ఆసనానికి రెడీ అవుతోంది. దానిని సోదరి అమృత కెమెరా చట్రంలో బంధించింది. మ్యాట్ పై `యోగిని` అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది.  కరోనా వైరస్ కి ముందు వ్యాయామ సెషన్ కు వెళ్లేటప్పుడు తరచుగా ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు తరచూ మలైకా తన సోదరి తో కలిసి ఫిట్నెస్ సెషన్స్ లో పాల్గొంటోంది.

ఇటీవల మలైకా కరోనా వైరస్ నుండి కోలుకొని తిరిగి పనిలోకి చేరింది. ఇండియాస్ బెస్ట్ డాన్సర్ టీవీ కార్యక్రమం న్యాయమూర్తుల ప్యానెల్ లో మలైకా ఒకరు. ఆరోగ్యం పరంగా కోలుకుని తిరిగి పనికి రావడానికి సంతోషిస్తున్నానని మలైకా తెలిపింది. ఇటీవల.. ఫరా ఖాన్ ఈ కార్యక్రమానికి గెస్ట్ న్యాయమూర్తిగా హాజరయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: