వాణిశ్రీ...డెబ్భయ్యవ దశకంలో అగ్రతారగా వెలుగొంది. ఈమె అసలు పేరు రత్న కుమారి. కేవలం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వాణిశ్రీ నటన పై ఉన్న ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. శ్రీదేవి , జయ ప్రదాలు సినీ రంగ ప్రవేశం చేసే వరకు వాణిశ్రీనే అగ్రకథానాయికగా ఉండేది. ఆ తర్వాత సినీ రంగం నుండి విరమణ ప్రకటించి తన ఫ్యామిలీ డాక్టర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. వీరికి ఒక కుమారుడు మరియు కుమార్తె ఉండగా, ఇటీవల కుమారుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

ఇక అస్సలు విషయానికి వస్తే వాణిశ్రీ కి ఒక అక్క కూడా ఉంది. హీరోయిన్ గా మూడు షెడ్యూల్స్ చేస్తూ కొన్నేళ్ల పాటు బిజీ గా ఉంటూ వాణిశ్రీ సంపాదించినా ఆస్తులన్నీ తన అక్క, తల్లి చేతిలోనే పెట్టింది. ఆమె పెళ్లి చేసుకునేవరకు ఆస్తుల గురించి ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. కానీ పెళ్లయ్యాక వాణిశ్రీ భర్త వివరాలు అడగడం తో అస్సలు విషయాలు బయటకు వచ్చాయి. వాణిశ్రీ ఎంతో కష్టపడి సంపాదించినా కొన్ని కోట్ల ఆస్తులు ఆమె అక్క బావ కాజేశారని అర్ధం అయింది. తన ఆస్థి తనకు ఇమ్మని అడగగా వాణిశ్రీ సొంత అక్క, ఆమెపై విషప్రయోగం చేసి అడ్డు తప్పించుకోవాలనుకుంది. కానీ ఎలాగోలా బ్రతికి బయటపడి కోర్ట్ లో కేసు వేయగా అది కొన్నేళ్ల పాటు కొనసాగింది. చివరికి కోర్ట్ లో జడ్జ్ అస్సలు నువ్వు నటివేనా అని ప్రశ్నించగా తానేంటో నిరూపించుకోవడం కోసం ఎనభయ్యవ దశకంలో తల్లి, అత్త పాత్రల్లో మల్లి నటించడం ప్రారంభించింది. ఇలా ఆలా కోర్ట్ లో కేసు గెలిచి తన ఆస్తిలో మూడోవంతు సంపాదించుకోగలిగింది. కొన్నేళ్లు గడిచాక వాణిశ్రీ అక్క బావను ఆమె సంతానం ఇంట్లో నుండి గెంటెయ్యగా, వాణిశ్రీ అక్కున చేర్చుకొని చివరి వరకు సాకింది. తనకు కీడు చేసిన కూడా మేలు చేసే గుణం వాణిశ్రీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: