వెంకటేష్,సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు " సినిమా ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ఆ సినిమా ఒక నవ్వుల వర్షంగా పండింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మాత్రం జనాలు అతుక్కుపోతారు. కథ,కథనం, వినోదం  ఇలా ఎన్నో కలగలిపి విందుభోజనం లా అందించారు ఈవీవీ సత్యనారాయణ. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కూడా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ సౌందర్య పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో, ఇక వెంకటేష్ కు రెండవ భార్యగా నటించిన,నేపాలి అమ్మాయి మనీషా పాత్ర కూడా అంతే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ఆమె పేరు వినీత . ఇక ఆ అమ్మాయి ప్రస్తుతం ఎలా ఉందో? ఏం చేస్తుందో? ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో వెంకటేష్ కు రెండవ భార్యగా నటించిన నేపాలి అమ్మాయి వినీత. ఇక ఈ సినిమాలో ఆమె నేపాలీ భాష మాట్లాడుతూ, కిలికిలి అంటూ మేకపిల్లతో ఆడుకున్న  ఈ అమ్మాయికి ఇప్పటికీ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ ఫోటోలో చూస్తున్నప్పటికీ ఈ అమ్మాయి చాలా లావుగా ఉండడం తో ఎవరూ సరిగా గుర్తుపట్టలేక పోతున్నారు.


సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మొదట్లో చాలా మంది హీరోయిన్ లు సన్నగా, నాజూగ్గా ఉండేవారు. కానీ వారికి రాను రాను సినిమాల్లో అవకాశాలు తగ్గాక, హీరోయిన్లందరూ లావెక్కడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు,మొదట్లో ప్రేక్షకులను అలరించి,ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక బాగా లావు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇదే కోవలో వినీత కూడా ఉంది. వినీత కు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ద్వారా బాగా పాపులారిటీ ను అందుకుంది. అయితే ఆ పాపులారిటీని ఆమె శాశ్వతంగా నిలుపుకోలేకపోయింది.


ఇక దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర సినీ పరిశ్రమలకు వెళ్ళిపోయింది. అక్కడ ఆమె బాగానే ఉన్నప్పటికీ,ఏవో కారణాల చేత హఠాత్తుగా సినిమాలను మానేసింది. 1993లో చిన్న జమీన్ అనే తమిళ చిత్రం ద్వారా పరిచయమైన వినీత ఆ తర్వాత 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు నటించింది. ఇక అంతే కాకుండా హిందీ,కన్నడ, మలయాళం వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆఖరిగా 2009లో వినీత " ఎంగ రాశి నల్ల రాశి " అనే తమిళ సినిమా చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: