తన అందచందాలతో నేషనల్ క్రష్ గా నిలిచిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్ సినిమాలైన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను మినహాయించి రష్మిక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా క్యాస్ట్ గురించి గత కొద్ది రోజులుగా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే అసలు రామ్ చరణ్, ఎస్.శంకర్ మూవీ ప్రాజెక్ట్ పట్టా లెక్కుతుందా లేక అటకెక్కుతుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే రణవీర్ సింగ్ తో కలిసి అపరిచితుడు మూవీకి హిందీ రీమేక్ చేయాల్సి ఉంది. అయితే అపరిచితుడు మూవీ నిర్మాత రవిచంద్రన్.. స్టోరీ హక్కుల విషయంలో శంకర్ తో గొడవ పెట్టుకున్నారు. తాను స్టోరీ కొనుగోలు చేశానని తన అనుమతి లేకుండా తన స్టోరీ తోనే బాలీవుడ్ సినిమా చేయడానికి శంకర్ ఎలా సిద్ధమవుతారని రవిచంద్రన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాలని లైకా ప్రొడక్షన్స్ శంకర్ పై ఒత్తిడి తెస్తోంది. తన చుట్టూ అన్ని వివాదాలే చుట్టుముడుతున్న నేపథ్యంలో శంకర్ రామ్ చరణ్ సినిమా చేస్తారా అనే సందేహం వ్యక్తమవుతోంది.



ఇదిలా ఉండగా.. డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ 15వ సినిమాలో రష్మిక మందన్న ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారట. శంకర్ ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ సినిమా ప్రారంభం అవుతుందో లేదో తెలియని నేపథ్యంలో ఫైనల్ కన్ఫర్మేషన్ కాల్ కోసం రష్మిక వేచి చూస్తూనే ఉన్నారట. మరి స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటించే అవకాశం రష్మిక కి దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: