ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అలాగే కొంతమంది హీరోయిన్లు కూడా తమకంటూ ప్రత్యేకమైన కార్ వ్యాన్ లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వీరు షూటింగ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి షూటింగ్ కోసం రెడీ అవడానికి ఇలాంటి ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ ను హీరోలు, హీరోయిన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్కు ఉన్న కార్ వ్యాన్ కు మాత్రం చాలా ప్రత్యేకత ఉందట. అయితే ఎందుకంత ప్రత్యేకత..? అందులో ఏముంది..? అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..



నిజానికీ  షూటింగ్ సమయంలో నిర్మాతలే ఆ హీరోలకు అత్యంత విలువైన  కార్ వ్యాన్లను ఏర్పాటు చేసేవారు. కానీ కాలక్రమేణా  ఆ తర్వాత హీరోలే సొంతంగా కార్ వ్యాన్ లను కొనుగోలు చేసుకుని మరీ  షూటింగ్ సమయంలో వాటికి అద్దెలు కూడా ..నిర్మాతల దగ్గర నుండే వసూల్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే  మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాజాగా  ఓ కార్  వ్యాన్ ను , తన అభిరుచికి తగినట్టుగా.. ఆ కార్ వ్యాన్ లో అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉండేలా దీనిని డిజైన్ చేయించుకొని మరీ కొనుగోలు చేశాడట.


ఇంత లగ్జరీగా డిజైన్ చేయించుకున్న కార్ వ్యాన్ కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఈ కార్ వ్యాన్ లో  సహజసిద్దమైన వెలుతురు వచ్చే ఒక  సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ వెలుతురు  కాకుండా సహజ సిద్దమైన వెలుతురును  ఆస్వాదించేందుకు ఈ కార్  వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నారట ప్రభాస్‌. ఈ విషయాన్ని  ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న  'ఆదిపురుష్'  డైరెక్టర్  ఓం రౌత్ ఇటీవల తెలియజేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు డబ్బుల వున్న వారు ఏమైనా చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: