బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే బాహుబలి సినిమా తో రాజమౌళి అక్కడ మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. దానికి తోడు రామ్ చరణ్ కూడా జంజీర్ సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. దాంతో ఈ సినిమాను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు తమ సినిమాగానే పరిగణిస్తూ ఉన్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనీ వారు చిత్రంపై రోజురోజుకి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఇక్కడ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ప్లాన్ చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా ప్లాన్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి మరియు బాలకృష్ణ ముఖ్య అతిధులుగా పిలవనుంది చిత్ర బృందం. ఇకపోతే ఇద్దరు కూడా ఈ సినిమాలోని హీరోలకు ముఖ్య అర్థం కావడం విశేషం రామ్ చరణ్ చిరంజీవి తండ్రి కాగా ఎన్టీఆర్ కు బాలకృష్ణ బాబాయ్ అవుతారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించి భారీ వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి