మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా `ఆర్ ఆర్ ఆర్`. పాన్ ఇండియా లెవెల్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఫిల్మ్ మేకర్స్ తో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ క్రేజ్ ని సోంతం చేసుకుంది.`బాహుబలి` సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.దీనికి తోడుగా రాజమౌళిసినిమా ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ లు వేయడం..ఇంకా దాదాపు 20 కోట్లు ప్రమోషన్స్ కి ఖర్చు పెట్టించడం ఇందు కోసం బాలీవుడ్ లో వారం పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మకాం వేయడం అక్కడి కీలక మీడియాల్లో వరుస ప్రమోషన్స్ చేయడంతో `ఆర్ ఆర్ ఆర్` సినిమా ఉత్తరాదిలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ అనేది ఏర్పడింది.దీంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని జక్కన్న రాజమౌళి అప్పుడే లెక్కలు కూడా వేసుకున్నారు. జనవరి 7న వరల్డ్ వైడ్ గా 14 బాషల్లో విడుదల అని ప్లాన్ కూడా చేశారు.ఆ ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సడన్ గా ఒమిక్రాన్ కరోనా ప్రమాద ఘంటికలు మోగించడం వల్ల యాభై శాతం ఆక్యుపెన్సీకి కొన్నిఈశాన్య రాష్ట్రాలు రెడీ కావడం, నైట్ కర్ఫ్యూ విధించడం వంటి కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.అయితే తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` సినిమాకి హిందీలో పెద్దగా బజ్ లేక నానా తంటాలు పడుతున్నారట.ఇది నిజమే అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తారక్ చరణ్ ఇద్దరు కూడా నార్త్ ఆడియన్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారన్నది బాంబే వర్గాలు వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr