మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వరుస సినిమాలు  ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మూడు సినిమాలను చేస్తున్న మెగాస్టార్ చిరంజీ వి వాటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేశాడు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. ని న్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ఈ చిత్రాన్ని విజయదశమినాడు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నానని వెల్లడించాడు. అయితే విడుదల తేదీ మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు.

ఇక ఈ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరొక సినిమా బోళాశంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో దొరికేకుతున్న ఈ సినిమా పూర్త యి ప్రస్తుతం పోస్ట్ కోసం పనిలోనే ఉంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులకు ముందుకు వచ్చి అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది మెగాస్టార్ ఆలోచన. అంతేకాదు అంతకుముందే క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నాడట. 

ఇక ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వచ్చేయడాది వేసవిలో విడుదల చేయాలంటే భావిస్తున్నాడు. త్వరలో నే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రం ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆ విధంగా తాను చేస్తున్న మూడు సినిమాలలో రెండు సినిమాలను పండుగ సీజన్లో విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉండడం మెగాస్టార్ సరికొత్త ఆలోచనకు నిదర్శనం. పండుగ సమయాలలో ప్రేక్షకులందరూ సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు కాబట్టి చిరంజీవి కూడా ఆ విధమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: