నిఖిల్ హీరోగా చందు మండేటి డైరెక్షన్లు రూపొందించిన చిత్రం కార్తికేయ-2. ఈ చిత్రం ఈనెల 13వ తేదీన విడుదల అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోని ఈ సినిమా టీమ్ సక్సెస్ మీ ట్ ను నిర్వహించింది. ఇక ఈ సక్సెస్ మీట్ కి దిల్ రాజు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా ఆడితే చాలా సంతోషపడే వారిలో నేను కూడా ఒకరిని అందులో నా స్వార్థం కూడా ఉన్నది అని తెలిపారు అదేమిటంటే నిఖిల్ తో ఒక సినిమా అండర్ ప్రాసెస్ లో ఉన్నది డైరెక్టర్ తో ఒక సినిమా మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలిపారు.


ఇక హీరో డైరెక్టర్ మాదిరిగా అనుపమ కూడా నా వైపుకు రావాలని అడుగుతున్నాను.. ఆమె బిహేవియర్ తనకు బాగా నచ్చింది అని ఈ సినిమా నిర్మాతను నేను అభినందిస్తున్నాను అని తెలిపారు. ఇక ఈ సినిమాను సరదాగా ఒక 50 థియేటర్లలో విడుదల చేస్తే రెండవ రోజున 200 థియేటర్లలో .. ఇక మూడవ రోజున 700 థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది అని తెలిపారు. ప్రాంతాలు దాటుకొని ఈ సినిమా ఒక రేంజికి వెళ్లిపోయింది అని దీంతో తెలుగు సినిమా సొంత చూపుతోంది అని తెలిపారు. ఇక పుష్ప సినిమా కూడా ఇలాగే మొదలైందని తెలిపారు అల్లు అరవింద్.


ఇక అఖండ సినిమా ఎమోషనల్ గా మంచి సక్సెస్ అయ్యింది అని అయితే ఆ సినిమా చూసినప్పుడు మరో రెండు మూడేళ్లలో బీసీ లాంటి సినిమాలు ఎవరైనా చేయవచ్చు అనుకున్నానని ఒక పెద్ద డైరెక్టర్ తో కూడా అనుకున్నారని తెలిపారు. విష్ణుమూర్తిగా ప్రధానంగా చేసుకొని ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని భావించినట్లుగా తెలిపారు. అయితే అలా అనుకున్న ఒక ఏడాదిలోపే బాలయ్య ఇలాంటి సినిమాతో దర్శనం కావడం విశేషమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: