పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయడం ప్రతి హీరో కూడా ఒక అదృష్టంగా ఇంకా అలాగే ఒక అద్భుత అవకాశంగా భావిస్తూ ఉంటారు. ఆయన క్రియేట్ చేసే విజువల్ వండర్ లో సెట్ ప్రాపర్టీగా కనిపించేందుకు కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అందరూ కూడా అంటూ ఉంటారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునే వారు వందల సంఖ్యలో ఇండస్ట్రీలో ఉన్నారు.ఎంతో మంది రాజమౌళి సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆయన దర్శకత్వంలో నటించాలని తాను భావించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మధ్య చిరంజీవి చేసిన కామెంట్స్ కు సంబంధించి తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ వివరణ అడిగారు.ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయక పోవడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ... భారతీయ చలన చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప అద్భుతమైన దర్శకుడు రాజమౌళి.


ఆయన కథ అనుకున్నప్పటి నుండి సినిమాను పూర్తి చేయడానికి అయిదు సంవత్సరాల సమయం అయినా తీసుకుంటారు. ఆయన సినిమాలో చేయాలి అంటే ఆయనతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.ఆయనతో ట్రావెల్ చేసిన సమయంలోనే అద్భుతమైన ఔట్ పుట్ వస్తుంది. కాని నేనేమో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అందుకే మా ఇద్దరికి సెట్ అవ్వదు అన్నట్లుగా మాట్లాడాడు చిరంజీవి. అంటే రాజమౌళిని ఆకాశానికి ఎత్తినట్లే మాట్లాడుతూ సినిమాల మేకింగ్ విషయంలో ఆలస్యం చేస్తాడు అంటూ సున్నితంగా విమర్శించినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే సినిమా పనుల్లో చాలా బిజీగా వున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులు ఇప్పటినుంచే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ సినిమా పెద్ద పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించే పనిలో వున్నాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: