
ఆదా శర్మ తన నటనతో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు పొందింది. ఈమె కొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆదా శర్మ కేరళ స్టోరీ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ తెలుగుతోపాటుగా హిందీలో కూడా రిలీజ్ అయింది. అయితే తాజాగా హీరోయిన్ ఆదా శర్మ నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ సంచలన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ సినీ నేపథ్య కుటుంబం నుంచి రాలేదని తెలిపింది. ఒకవేళ అలా వచ్చి ఉంటే తను కచ్చితంగా ఒక రొమాంటిక్ సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యేదాని చెప్పింది. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన తను ఒప్పుకున్న తన కుటుంబం మాత్రం ఒప్పుకోదని తెలిపింది. ఈ క్రమంలో తను ఇండస్ట్రీ బయట నుండి వచ్చినందు వల్లే హర్రర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అలా వచ్చినా కూడా తనని ప్రేక్షకులు అప్పటినుండి ఇప్పటివరకు ఆదరిస్తున్నారని తెలిపింది.
దానికి తను చాలా అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నట్లు వెల్లడించింది. ప్రేక్షకుల ఆదరణ ఉండడం వల్లే తను ఎలాంటి పాత్రనైనా ధైర్యంగా చేస్తుందని చెప్పింది. ఈ క్రమంలోనే ఆదా శర్మ కేరళ స్టోరీ, భాస్కర్ ది నక్సల్స్ స్టోరీ సినిమాలు హిట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. త్వరలో ఆదాశర్మ దేవత రూపంలో నటిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా హిందీ, కన్నడ, తమిళం భాషల్లో తెరకెక్కనుంది.