నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న భారీ మూవీ పారడైజ్ .. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనేది హీరో నాని ప్లాన్ .. కానీ ఈ ఏడాది మాత్రం హిట్ 3 ఒకటే అని గతం లో క్లారిటీ ఇచ్చేశాడు .. అయితే పారడైజ్ సినిమా చాలా ఎక్కువ వర్క్ తో కూడిన సినిమా భారీ సెట్లు , సీజీలు ఇలా చాలా పని ఉంటుంది .. పైగా పీరియాటిక్ యాక్షన్ డ్రామా కూడా.. అలనాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ ..
 

అయితే ఈ సినిమా షూటింగ్ మే మొదటి వారం నుంచి మొదలవుతుందని .. మే 15 నుంచి నాని షూటింగ్లో జాయిన్ అవుతారని మొన్నటి వరకు ఓ టాక్ వినిపించింది .. కానీ ఇప్పుడు ఓ నెల వెనక్కు వెళుతున్నట్టు తెలుస్తుంది  .. సిటీ ఔట్స్కట్లో ఓల్డ్ సికింద్రాబాద్ సెటిల్మెంట్ సెట్ ఒకటి భారీగా వేశారు .. ఇందులో ఓ భారీ ఫైట్ షూట్ మొదలు పెట్టాలన్నది ఆలోచన ..



అయితే ఇప్పుడు ఈ భారీ ఫైట్ కు రీహ‌ర్స‌ల్స్‌ జరుగుతున్నాయి .. ఇప్పుడు ఈ రిహార్స‌ల్ప్‌ ఓ వారం రోజులు పడుతుంది .. అందువల్ల జూన్ లో మొదలుపెడతారు. జూన్ రెండో వారం లో నాని షూటింగ్లో అడుగు పెడతారు .. ఇక ఈ లెక్కన చూసుకుంటే పారడైజ్‌ సినిమా 2026 స‌మ్మ‌ర్‌ టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది .. ఇక ఈసినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తుండగా ఇటివ‌లే ఆడియో రేట్స్ 18 కోట్ల కు అమ్ముడు అయిపోయాయి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: