తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి యాంకరింగ్ స్టైల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. అనసూయ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించింది. మొదటి షో తోనే మంచి గుర్తింపు అందుకున్న అనసూయ అనేక షో లలో యాంకరింగ్ చేసింది. అంతేకాకుండా సినిమాలలోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే అవకాశాన్ని అందుకుంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సక్సెస్ సాధించింది. 

ప్రస్తుతం అనసూయ ఫుల్ ఫామ్ మీద తన కెరీర్ కొనసాగిస్తోంది. వరుసగా సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుకుంటుంది. ఎప్పుడు బిజీగా ఉండే అనసూయ తనకు సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ తన భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో బికినీ ధరించి హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోటోలు దిగింది. అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

చాలా హాట్ గా, అందంగా ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే....మరి కొంత మంది వయసు పెరిగిన నీకు ఇంకా బుద్ధి రావడం లేదు ఇంత ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనసూయకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా వైరల్ అవుతాయి. ఆ ఫోటోలపై కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతే... మరికొంతమంది నెగెటివ్ గా ట్రోల్ చేస్తారు. తాజాగా అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేసిన ఫోటోలపై చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: