
ఈ నెల 30వ తేదీన రిలీజ్ కానున్న భైరవం సినిమాతో పెద్ద సినిమాల సందడి మొదలుకానుంది. జూన్ నెల 5వ తేదీన థగ్ లైఫ్ విడుదల కానుండగా జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. జూన్ నెల 20వ తేదీన కుబేర రిలీజ్ కానుండగా జూన్ 27వ తేదీన కన్నప్ప సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ఈ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు సైతం అమలై పవన్ కరుణిస్తే ఈ సినిమాల రేంజ్ మాత్రం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ నిజంగానే టికెట్ రేట్ల పెంపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా అనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి కూడా ఒకింత గందరగోళం నెలకొంది. పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఓజీ సినిమాలో పవన్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.