లైగర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా సెట్ అయింది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హైద‌రాబాద్ మ‌రియు చెన్నైలో షూటింగ్ కు అనుకూలంగా ఉండే లోకేష‌న్స్ ను చిత్ర‌బృందం రిక్కీ చేస్తోంది.


పూరి - విజ‌య్ కాంబో మూవీకి `బెగ్గర్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో  విజయ్ సేతుపతి నెవ‌ర్ బిఫోర్‌ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ ఎంపికపై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీనియ‌ర్ న‌టి టబు, రాధిక ఆప్టే వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ నివేదా థామస్‌ను విజ‌య్ సేతుప‌తికి జోడిగా ఖరారు చేశారట పూరి.


ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా పూర్తి అయ్యాయని నెట్టింట టాక్ న‌డుస్తుండ‌టంతో.. పూరి సెలక్షన్ అదుర్స్ అని సినీప్రియలు అభిప్రాయపడుతున్నారు. కాగా, `జెంటిల్ మేన్    ` మూవీతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న నివేదా థామ‌స్.. గ‌త ఏడాది `35 చిన్న కథ కాదు` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇందులో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిగా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాకు గానూ ఇటీవల ఉత్తమ న‌టిగా గ‌ద్ద‌ర్‌ అవార్డు కూడా కైవశం చేసుకుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: