టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. చందమామ మూవీ తో మొదటి కమర్షియల్ విజయాన్ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాతో కాజల్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ల స్థాయికి చేరుకుంది. అలా చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా అదే రేంజ్ లో కెరియర్ను అనేక సంవత్సరాలు పాటు కాజల్ కొనసాగించింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో కాజల్ కి సినిమా అవకాశాలు తగ్గాయి. ఆఖరుగా ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ , మంచు విష్ణు హీరో గా రూపొందిన కన్నప్ప అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ ఓ రెండు కొత్త బాధ్యతలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇంత కాలం పాటు నటిగా అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీ మరి కొంత కాలం లోనే దర్శకురాలిగా , నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఒక వేళ నిజం గానే కాజల్ దర్శకురాలిగా , నిర్మాతగా కెరియర్ను స్టార్ట్ చేసినట్లయితే నటిగా సక్సెస్ అయిన స్థాయిలో అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: