
విజయ్ దేవరకొండ చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం కింగ్డమ్. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమాని జులై 31వ తేదీన రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలోనే హీరో విజయ్ దేవరకొండ జ్వరంతో హాస్పిటల్ ఫాల్ అవ్వడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. మరి విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో చూడాలి.
2011లో నువ్విలా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించారు. పెళ్లిచూపులు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని సంపాదించారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించి పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ తనకు నచ్చితే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉంటారు. గత కొద్దిరోజుల నుంచి హీరోయిన్ రష్మిక తో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.మరి త్వరలోనే ఈ జంట ఏదైనా గుడ్ న్యూస్ తెలియజేస్తుందేమో చూడాలి మరి.