
కొబ్బరికాయ కొట్టి కర్పూరం తిప్పి వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు అనే డైలాగుతో టీజర్ మొదలవుతుంది.. ఆ తర్వాతే హీరో సూర్య ఎంట్రీ ఇవ్వడం టీజర్ కే హైలెట్ గా కనిపిస్తోంది. హీరో సూర్య ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి లాయర్ పాత్రలో కాగా, మరొకటి మాస్ పాత్రలో అన్నట్లుగా కనిపిస్తోంది. కరుప్పు చిత్రంలో కూడా చాలా వైలెన్స్ ఉన్నట్లుగా టీజర్ చూస్తే కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు హీరో సూర్య లుక్స్, స్టైల్ కూడా హైలెట్గా నిలుస్తున్నాయి. అభిమానులకైతే ఈ టీజర్ సూపర్ గా ఆకట్టుకుంటోంది. సూర్య చెప్పే డైలాగులు కూడా అభిమానులను ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.
1997లో సూర్య నెర్రుక్కు నీర్ అనే చిత్రంతో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి అటు తెలుగు ,తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ ఏడాది రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో అభిమానుల తీవ్ర నిరాశతో ఉన్నారు.కరుప్పు సినిమాతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తారేమో చూడాలి మరి సూర్య. ప్రస్తుతం కరుప్పు టీజర్ వైరల్ గా మారుతున్నది.