సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ థ్రిల్ల‌ర్ `కూలీ`. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి హేమా హేమీలు భాగం కావ‌డంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అందుకు తగ్గట్టుగానే బుకింగ్స్ జరిగాయి. కొన్ని ప్రాంతాల‌లో ఇప్ప‌టికే కూలీ సినిమా షోలు కూడా ప‌డ‌గా.. మెజారిటీ ఆడియోన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ల‌భిస్తోంది.


అద‌లా ఉంటే.. ఓవ‌ర్సీస్ లో ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో కూడా కూలీ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. అందులో భాగంగానే ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. దీంతో సినిమాను ముందుగానే చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. కానీ యూఎస్‌లోని కొన్ని చోట్ల ఎర్లీ ప్రీమియర్ షోస్ ర‌ద్దు అయ్యాయి. ప‌లు కార‌ణాల‌తో ఎర్లీ ప్రీమియర్ షోస్ ను క్యాన్సిల్ చేయ‌డంతో ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. ఊరించి ఉసూరుమ‌నిపించారు క‌ద‌రా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.


కాగా, కూలీ టాక్ విష‌యానికి వ‌స్తే.. రజనీకాంత్ స్టైల్‌, విలన్ గా నాగార్జున స్వాగ్, అనిరుధ్ సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయ‌ని చాలా మంది చెబుతున్నారు. సైమన్ పాత్రలో నాగ్ మాస్ ప్రెజెన్స్ ఆక‌ట్టుకుంద‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టిలాగానే అద‌ర‌గొట్టార‌ని.. టైటిల్ కార్డు కిక్ ఇచ్చేలా ఉంద‌ని చెబుతున్నారు. ప్రిడ‌క్ట‌బుల్ స్టోరీనే అయిన‌ప్ప‌టికీ.. లోకేష్ మ‌రోసారి త‌న మార్క్ చూపించాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు కూలీ మూవీకి నెగ‌టివ్ రివ్యూలు కూడా వ‌స్తున్నాయి. సినిమా అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయిందని కొంద‌రు చెబుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: