టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ స‌క్సెస్ చూసి చాలా కాలం అయిపోయింది. 2020లో విడుద‌లైన `భీష్మ` తర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి హిట్ నితిన్ ఖాతాలో ప‌డ‌లేదు. ఇటీవ‌ల `రాబిన్‌హుడ్`, `త‌మ్ముడు` చిత్రాల‌తో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న‌ప్ప‌టికీ నితిన్‌కు నిరాశే ఎదురైంది. కెరీర్ మ‌ళ్లీ గాడిలో ప‌డాలంటే నితిన్‌కు హిట్ చాలా ముఖ్యం. అయితే హిట్ కోసం నితిన్ మ‌ళ్లీ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కే కుమార్‌నే న‌మ్ముకున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


గ‌తంలో నితిన్‌, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో `ఇష్క్‌` మూవీ వ‌చ్చింది. 2012లో విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అప్ప‌టికే వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కు ఇష్క్ మూవీతో విక్ర‌మ్ కే కుమార్ స‌క్సెస్ ను అందించారు. ఇప్పుడు మ‌రోసారి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. `థ్యాంక్యూ` త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ నుంచి మ‌రో సినిమా రాలేదు.


అయితే ఈయ‌న త‌న నెక్స్ట్ ఫిల్మ్‌ను నితిన్ తో ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. హై బడ్జెట్ తో స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందట‌. మ‌రి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను మ‌రోసారి విక్ర‌మ్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిస్తారా? లేదా? అన్న‌ది చూడాలి. కాగా, త‌మ్ముడు డిజాస్ట‌ర్ అనంత‌రం `బ‌ల‌గం` ఫేమ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ `ఎల్ల‌మ్మ‌` అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా కూడా ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమా డిలే అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: