
సినిమా రిలీజ్‌కి ముందే టికెట్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే, ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ బోర్డులు కనబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టికెట్లు రిలీజ్ చేసిన ప్రతి చోట గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ అయిపోతున్నాయి. ఒక్క షో కిఒక్క టికెట్ కూడా ఖాళీగా లేకపోవడం "ఓజీ" కోసం ఎంత పెద్ద అంచనాలు ఏర్పడ్డాయో స్పష్టంగా చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది."సాహో" ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెమండస్ హైప్ సృష్టించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఈ కాంబినేషన్‌నే ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచింది.
ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్, లుక్స్ అన్ని సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ట్రైలర్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అయినా అభిమానులను నిరాశపరచకుండా, ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ వర్షం కారణంగా కొంత ఇబ్బందిగా మారినా, పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన స్టైల్లో ఫ్యాన్స్‌ను ఎక్కడా నిరాశపరచలేదు. వర్షంలో తడుస్తూనే స్పీచ్ కొనసాగించడం, అభిమానుల కోసం పూర్తి కాకపోయిన ట్రైలర్‌ను రిలీజ్ చేయించడం—హైలెట్ గా మారింది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ లుక్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్—అన్ని వేరే లెవల్. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నాన్-ఫ్యాన్స్ కూడా “ఇది మస్ట్ వాచ్ మూవీ” అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పవర్, సుజిత్ డైరెక్షన్, ఇమ్రాన్ హష్మీ విలనిజం, థమన్ మ్యూజిక్ కలిసొచ్చి "ఓజీ"ని ఒక భారీ అనుభూతిగా మార్చనున్నాయి.
ఎన్నో వాయిదాల తర్వాత, ఎట్టకేలకు సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తుడిచిపెట్టడం ఖాయం అని ట్రేడ్ అనలిస్టులు ఇప్పటికే చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్‌ని థియేటర్లో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవ్వండి. "ఓజీ" స్టార్మ్‌ని మీరు మిస్ అవ్వకండి..!