టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొంత కాలం క్రితం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సోనాలి చౌహాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 2022 వ సంవత్సరం అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగా అనేక సమస్యలను ఎదుర్కొంది. మరి ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో అత్యంత ఎక్కువ ఎత్తున సమస్యలను ఎదుర్కొంది. ఈ మూవీ అంతా ఓకే అయిన తర్వాత ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్గా తీసుకున్నట్లు , ఆల్మోస్ట్ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంత ఓకే అయ్యాక కాజల్ అగర్వాల్ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో ఈ సినిమాలో హీరోయిన్ ని ఓకే చేయడానికి ఈ మూవీ బృందం చాలా రోజులు సమయం తీసుకుంది. 

ఆ సమయంలో ఈ మూవీ లో ఏ బ్యూటీ హీరోయిన్గా కనిపించనుంది ... ఈ ముద్దు గుమ్మ హీరోయిన్గా కనిపించనుంది అని అనేక మంది పేర్లు వచ్చాయి. ఇక అలాంటి సమయంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ , నాగార్జున కు జోడిగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చివరగా ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో నాగార్జున , సోనాలి చౌహాన్ జంటకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అలా ఈ మూవీ హీరోయిన్ విషయంలో అనేక కష్టాలను ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: