తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది జర్నలిస్టులు పాల్గొని సినిమాకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ చూసిన ఓ జర్నలిస్టు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో మీరు ఉన్నారు కదా.. మీరేమైనా నిజ జీవితంలో ఉమనైజరా అంటూ అందరూ ఆశ్చర్యపోయే ప్రశ్న అడిగారు. అయితే ఈ ప్రశ్న చాలా వివాదాస్పదం.. ఎందుకంటే ఉమనైజర్ అంటే ఎక్కువ మందితో తిరుగుతూ తక్కువ సమయానికే వారికి బ్రేకప్ చెపుతూ మళ్లీ వేరే అమ్మాయిలతో తిరిగేవాడు. అలాంటి వారిని ఉమనైజర్ అంటారు. కానీ ఈ సినిమా ట్రైలర్లో ఉమనైజర్ అనే పదానికి సెట్ అయ్యే కాన్సెప్ట్ కూడా లేదు.ఇద్దరు హీరోయిన్లతో కనిపించారు అంతే కానీ ఆ జర్నలిస్టుకి ట్రైలర్ చూస్తే ఏమనిపించిందో ఏమో తెలియదు

 కానీ నేరుగా సిద్దు జొన్నలగడ్డని మీరు నిజ జీవితంలో ఉమనైజరా అని అడిగారు. ఇక ఈ ప్రశ్నకు ఏం ఆన్సర్ చెప్పాలో కూడా సిద్దు జొన్నలగడ్డకు అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆయన మైండ్ బ్లాక్ అయినట్టు అయింది.దాంతో ఇది పర్సనల్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారా.. లేక ప్రెస్ మీటా అంటూ ఫైర్ అయ్యారు.దాంతో జర్నలిస్టు సైలెంట్ అయ్యారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ లో ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టుల నుండి చాలానే వస్తున్నాయి.ఏమీ ఆలోచించకుండానే హీరో హీరోయిన్లను తమ మనసులో ఉన్న మాటలు అడిగేస్తున్నారు. ఇలాంటి మాటల కారణంగా చాలామంది నటీనటులు ఇబ్బంది పడుతున్నారు.

రీసెంట్గా డ్యూడ్ మూవీ ఈవెంట్లో హీరో ప్రదీప్ రంగనాథ్ ని కూడా జర్నలిస్ట్ మీ కటౌట్ ఫేస్ చూస్తే అసలు హీరో మెటీరియల్ లానే లేరు.కానీ రెండు హిట్స్ కొట్టేశారు. అది మీ అదృష్టం అనుకోవాలా.. లేక మీరు సినిమా కోసం చేసిన హార్డ్ వర్క్ అనుకోవాలా అంటూ మొహం మీదే అడిగేసారు. ఇక ఈ ప్రశ్నకు కూడా ప్రదీప్ రంగనాథన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అలా జర్నలిస్టులు ఏమీ ఆలోచించకుండానే మొహం మీద అలా వివాదాస్పద ప్రశ్నలు అడగడం ఏంటి అని చాలామంది వాళ్లపై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: