
వాస్తవ సంఘటనల ఆధారంగా బైసన్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం ఈ సినిమా ట్రైలరే. ఇక ఇటీవల సెన్సార్ బోర్డ్ ప్రతినిధులు కూడా ఈ సినిమాని వీక్షించగా ఈ సినిమా పైన వారి ఇచ్చిన రివ్యూ విషాయనికి వెళ్తే.. బైసన్ సినిమా 1990లో తమిళనాడు నేపథ్యంలో సాగేటువంటి కథ చిత్రం. ఇందులో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తారు. గ్రామంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల కబడ్డీ ఆడకూడదంటూ తన తండ్రి ఒట్టు వేయించుకుంటారు. ఆ తర్వాత ధృవ్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ధృవ్ సమాజం నుంచి ఎలాంటి ఒత్తిడిలు ఎందుకు వచ్చాయి?అలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి? అనుపమ ఏం చేసింది అన్నది ఈ సినిమా కథ.
కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమా ఎన్నో సామాజిక అంశాలను గుర్తు చేస్తుందట. సమాజంలో అనగారిన వర్గాలకు ఎదురయ్యే సవాళ్లు సాధారణ యువకుడు కబడ్డీ క్రీడని ఎందుకు ఎంచుకోకూడదనే విషయాలను ఈ చిత్రంలో చూపించారు. ధృవ్ ఈ చిత్రంలో ఎన్నో బాగోద్వేగమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించారని, అనుపమ నటన కూడా చిత్రానికి హైలైట్ గా ఉందని సెన్సార్ సభ్యులు స్క్రీనింగ్ సందర్భంగా తెలియజేస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలోని కోర్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా బలంగా కనిపిస్తాయి. రజిషా విజయన్, పశుపతి ఇతర నటీనటుల సైతం తమదైన నటనతో అద్భుతంగా నటించారని అలాగే సాంకేతిక నిపుణుల పరంగా కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకునేలా ఉందని తెలిపారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు అభ్యంతరాలు ఉండడం చేత చేశారని వెల్లడించారు. బైసన్ సినిమాకి సెన్సార్ సభ్యులు 12 ఏళ్లకు పైబడిన బాలలు చూడవచ్చు అంటూ U/A సర్టిఫికెట్ ఇచ్చారు. మరి థియేటర్లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.