తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఉన్నట్టుండి ఈ బదిలీపై సమాచారం లేనప్పటికీ ఇటీవల మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఇటీవల పీవీ సింధు సాధించిన ఘనత సందర్బంగా గవర్నర్ నరసింహన్ ని కలిసింది. అయితే తాను ఇక తెలంగాణ గవర్నర్ గా ఉండకపోవచ్చని హింట్ ఇచ్చారు.  2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్‌ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అంటే తానూ బదిలీ అవుతున్నట్టు ముందే ఉహించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. 


ఇకపోతే తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళసై సౌందర్‌రాజన్‌ ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె.. డాక్టర్ గా పని చేసేవారు. 1961 జూన్ 2న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ లో జన్మించిన ఆమె తన ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత శిక్షణను కెనడా లో పూర్తిచేసింది. 
రాజకీయ నేపథ్యం.......


ఇక తన కుటుంబ విషయానికి వస్తే .. అత్తింటి వారు కాంగ్రెస్ పార్టీతో తరతరాలుగా అనుబంధం కొనసాగిస్తున్నప్పటికీ.. తమిళసై మాత్రం బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో విద్యార్ధి నాయకురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు.  అయితే ఇక్కడ  విశేషం ఏంటంటే ఈమె సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం సౌందర్‌రాజన్‌కు రాలేదు. గతంలో తమిళిసై సౌందర్‌రాజన్ 2006వ సంవత్సరం  , 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజయం పొందారు. అనంతరం 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విచితంగా ఓటమి చెందారు. మరోవైపు గత ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే నేత కనిమొళిపై పోటీ చేసి 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసిన రాష్టాల గవర్నర్ల విషయానికి వస్తే తెలంగాణ  గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ను, హిమాచల్‌ ప్రదేశ్‌కు బండారు దత్తాత్రేయను, రాజస్తాన్ కు కల్‌రాజ్‌ మిశ్రాను, మహారాష్ట్రకు భగత్‌సింగ్‌ కోశ్యారీను, కేరళకు మహ్మద్‌ ఖాన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: