సుకన్య సమృద్ది యోజన పేరుతో ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిల ఆర్థిక  భద్రతకు అత్యంత  ప్రాధాన్యత  ఇస్తూనే ఉన్నాయి. ఆడ పిల్లల కోసం ఎప్పటికప్పుడు సరి కొత్త పథకాలను తీసుకువస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో  కొత్త స్కీమ్‌ను లాంచ్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఆడ పిల్లల కోసం కొత్త పథకం,అక్టోబర్ 25న లాంచ్  చేయబోతున్నారు ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ . ఈ పథకం ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు వరుకు వర్తిస్తుంది అని, ఆరు విడతల్లో డబ్బులు  అందజేస్తారని తెలిపారు.


 ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 25న కన్యా సుమంగళ యోజన పేరుతో  స్కీమ్‌ను అమలు చేయబోతోంది. ఈ పథకం కింద ఆరు విడతల్లో రూ.15,000  మొత్తంగా ఆడపిల్లలకు  అందచేస్తారు.ఇది ఆడపిల్లలకు మంచి స్కీమ్‌ అనే చెప్పుకుంటున్నారు పథకం విన్నవారంతా. అమ్మాయిలు  ఇంటర్ పూర్తయ్యే నాటికీ మొత్తం డబ్బులు వాళ్లకు అందుతాయి.


కన్యా సుమంగల యోజన పథకంలో సులభంగా చేరొచ్చు అని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం  mksy.up.gov.in అనే వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేసారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ పథకం కోసం యోగి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,200 కోట్లు కేటాయించనున్నారట. ఈ పథకం కేవలం వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్న వారికే వర్తిస్తుంది అని,అలాగే ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు అని పేర్కొన్నారు. 


ఈ పథకం ఏప్రిల్ తర్వాత పుట్టిన ఆడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని, పాపు పుట్టిన వెంటనే  రూ.2,000 అందుతాయి. వాక్సినేషన్ కి  రూ.1000, మొదటి తరగతిలో  చేరినప్పుడు రూ.2000, 6వ తరగతికి  చేరినప్పుడు రూ.2000, 9వ క్లాస్‌లోకి వచ్చినప్పుడు  రూ.3000,ఇంటర్ పూర్తి అయిన తరువాత రూ.5000 అందజేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: