హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ మండలం ద్వారకానగర్ లో ఈ నెల 19వ తేదీన జరిగిన రజిత హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ఈరోజు రజిత హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. శశికుమార్ కీర్తి రజితను 10 లక్షల రూపాయల కొరకు హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడైన బాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 
 
పథకం ప్రకారమే రజిత హత్య జరిగిందని మహేష్ భగవత్ చెప్పారు. రజిత హత్య కేసు దృశ్యం సినిమాను తలపిస్తోందని అన్నారు. తల్లిని హత్య చేసిన కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. బాల్ రెడ్డి కీర్తికి అబార్షన్ చేయించాడని కీర్తి, బాల్ రెడ్డి ప్రేమించుకున్నారని సీపీ భగవత్ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 
 
రజిత హత్యకు చాలా రోజుల ముందునుండే కుట్ర జరిగిందని తెలుస్తోంది. పోలీసులు శశికుమార్ కు కొంతమంది సహకరించారని గుర్తించినట్లు తెలుస్తోంది. మూడు పోలీస్ బృందాలు నిందితులు చెప్పిన విషయాల నిర్ధారణ కొరకు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. శశికుమార్ కీర్తిరెడ్డికి మద్యం తాగించి ఆ తరువాత చంపించాడని తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఈ ముగ్గురితో పాటు మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
పోలీసులు నిందితుల కాల్స్ డేటా, వాట్సాప్ చాటింగ్ మొదలైన వివరాలను సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శశికుమార్ కు రజిత మృతదేహాన్ని తుమ్మలగూడెం రైల్వే ట్రాక్ మీదకు తరలించటానికి కొందరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. మృతదేహాన్ని తరలించిన సమయంలో ప్రయాణించిన వారి వివరాల కోసం టోల్ ప్లాజా, సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు సమాచారం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: