మార్చి 23న పాకిస్తాన్ రిపబ్లిక్ డే సందర్భంగా... బుధవారం రోజు మిలటరీ పరేడ్, ఎయిర్ షో ట్రైనింగ్ జరుగుతుండగా ఒక దుర్ఘటన జరిగింది. అమెరికన్ తయారీ F-16 యుద్ధ విమానాన్ని నామన్ అక్రమ్ అనే ఒక ఫైలెట్ వృక్షాలు బాగా ఉన్న ప్రాంతంలో రిహర్షల్ చేస్తుండగా ఆ యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే యుద్ధ విమానాని కి ప్రమాదం జరిగినప్పటికీ భూమి మీద ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. కాకపోతే ఎఫ్-16 యుద్ధ విమాన పైలట్ ఈ ప్రమాదంలో మరణించాడు. పాకిస్థాన్ ప్రెసిడెంట్ అఫిఫ్ అల్వి మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపాడు. యుద్ధ విమానం కూలిపోయిన సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ ని పంపించామని అధికారులు చెప్పారు. అలాగే ఒక ఎంక్వయిరీ బృందం యుద్ధ విమానం కూలి పోవడానికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉంది. 

 




ఇస్లామాబాద్ లో పరేడ్, ఎయిర్ షో ప్రారంభం అవ్వగానే ఎఫ్ 16 యుద్ధ విమానం ఆకాశంలోకి రివ్వున ఎగిరిన కొన్ని సెకన్లలో పొగ భారీగా విడుదల చేసింది. దాంతో భూమి మీద ఉన్న అధికారులు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. అయితే పొగలు వచ్చిన కొన్ని క్షణాలలోనే ఎంతో ఎత్తులో ఉన్న ఆ యుద్ధ విమానం ఒక్కసారిగా కిందకు వస్తూ భూమి మీద పడి పేలిపోయింది. పాకిస్తాన్ దేశంలో మొత్తం 50 ఎఫ్ -16 యుద్ధవిమానాలు ఉండగా ఒక్కో అమెరికా తయారీ ఎఫ్ 16 యుద్ధ విమానం ధర అక్షరాలా రెండు వందల కోట్ల రూపాయల పైగా ఉంటుందని సమాచారం.

 


2 నెలల క్రితం పంజాబ్ ప్రాంతంలో ట్రైనింగ్ మిషన్ జరుగుతుండగా ఒక యుద్ధ విమానం కూలిపోగా ఇద్దరు పైలెట్లు చనిపోయారు. గత సంవత్సరం రావల్పిండిలో కూడా ఒక యుద్ధ విమాన ప్రమాదం జరిగి 18 మంది సైనికులు చనిపోయారు. 2016 సంవత్సరంలో ఉత్తర పాకిస్తాన్ నుండి ఇస్లామాబాద్ వెళ్తున్న ఒక విమానంలో కూలిపోగా ఆ ప్రమాదంలో 40 మందికి పైగా చనిపోయారు. వాస్తవానికి పాకిస్థాన్ ఇతర రంగాలలో కంటే తమ యుద్ధ సామాగ్రి పైనే ఎక్కువ వ్యయం ఖర్చు పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: