విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇప్పుడు ప్రజలను బాగా కంగారు పెడుతున్నాయి. ఎప్పుడు కూడా ఏదోక ప్రమాదం విశాఖలో జరుగుతూనే ఉంది. గత నాలుగు నెలల నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూ ప్రజలను భయపెట్టే  విధంగా వాతావరణం ఉంది అనే చెప్పాలి. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే పరిస్థితులు మాత్రం ఏదోక రూపంలో వెంటాడుతూ కంగారు పెడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో మరో ప్రమాదం జరిగింది.  ఇటీవలి కాలంలో ఇది 8 వ ప్రమాదం.

నిన్న విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఒక ప్రమాదం జరిగింది. తాజాగా మరోసారి నౌక లో ప్రమాదం జరిగింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది అని అధికారులు పేర్కొన్నారు. పనామా BD51 నౌక క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయి. చెన్నై నుంచి వచ్చిన నౌక వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్ లో ఉండగా ఘటన జరిగింది అని అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్నారు పోర్ట్ అధికారులు.

ఒక్క విశాఖ అనే కాదు గాని ఏపీలో దాదాపుగా ఈ మధ్య కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నేడు ఉదయం విజయవాడలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది ఆరోగ్యం విషమంగా ఉంది.  5 మంది ఆరోగ్యం విషమంగా ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆర్ధిక సహాయం కూడా ప్రకటించారు. 50 లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నామని ఆయన ఉదయం ప్రకటించారు. కేంద్రం కూడా ఈ ప్రమాదంపై తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: