ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఒక్కో నేత ఒక్కో విధంగా షాక్ ఇస్తూ వస్తున్నారు. ఆ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బయటకు వెళ్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. పార్టీలో చాలా మంది కీలక నేతలు ఉన్నా సరే ఈ కరోనా సమయంలో ఎవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు. దాదాపు అగ్ర నేతలు అందరూ సైలెంట్ గా ఉన్నారు. వర్ల రామయ్య, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు మినహా పెద్దగా ఎవరూ మీడియా ముందు కనబడటం లేదు. అప్పుడప్పుడు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు లాంటి నేతలు మీడియా ముందు హడావుడి చేస్తున్నారు.

అయినా సరే వారు కూడా దాదాపుగా సైలెంట్ గా ఉన్నారు అని టిడిపి వర్గాలు అంటున్నాయి. కొంత మంది నేతలు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ మారే సూచనలు ఉన్నాయని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. గల్లా జయదేవ్ సంగతి పక్కన పెడితే విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

నేడు ఆయన విజయవాడ ఫ్లైఓవర్ కి సంబంధించి కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ మారే అంశం గురించి చర్చ కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేసినేని నాని కలవడం వెనుక ఉద్దేశం ఇదే అని టిడిపి వర్గాలు కూడా పైకి చెప్పకపోయినా అంతర్గత సంభాషణల్లో అనుకునే పరిస్థితి గత కొంతకాలంగా ఉంది. ఆయన టిడిపి మీద అసహనం గా ఉన్నారు అని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు నేరుగా కేంద్ర మంత్రిని కలవడంతో ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయం అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: