మారుతున్న కాలంతో పాటే గ్యాస్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీకు అర్హులైన వారికి బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేస్తోంది. అయితే చాలామంది తాము అర్హులైనా బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ నగదు జమ కావడం లేదని చెబుతున్నారు. దేశంలో 80 శాతం కుటుంబాలు ఎల్‌పీజీ కనెక్షన్‌లను వినియోగిస్తున్నట్లు ఒక అంచనా.
 
ఎల్పీజీ సబ్సిడీ ప్రయోజనం పొందడానికి ఆధార్‌ నంబర్ ను బ్యాంక్ ఖాతాకు జత చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ ను లింక్ చేయాలంటే మొదట గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆధార్ కార్డును ఎల్‌పీజీ కనెక్షన్‌కు కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మొదట "ఎల్‌పీజీ కంపెనీ" ని ఎంచుకోవాలి. అక్కడ ఇవ్వబడిన జాబితా నుంచి పంపిణీ దారుకు సంబంధించిన పేరును ఎంచుకుని ఆ తర్వాత వినియోగదారు సంఖ్యను నమోదు చేయాలి.
 
ఆ తరువాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. మన నుంచి అభ్యర్థన వెళ్లిన తరువాత సంబంధిత కంపెనీ సిబ్బంది సమాచారం ధృవీకరించి రిజిష్టర్ చేసిన ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ కు ధృవీకరణకు సంబంధించిన సమాచారం పంపుతారు.
 
ఆన్ లైన్ విధానంపై అవగాహన లేనివాళ్లు సబ్సిడీ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఫారమ్ ను ప్రింట్ తీసుకుని అవసరమైన సమాచారాన్ని నింపి సమీప ఎల్‌పీజీ పంపిణీదారు కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. 18002333555 కాల్ సెంటర్ నంబర్ ఫోన్ చేసి ఆధార్‌ను ఎల్‌పీజీ కనెక్షన్‌తో లింక్ చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి అవసరమైన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పోస్ట్ ద్వారా సదరు కంపెనీ అడ్రస్ కు పంపి ఆధార్ ను ఎల్పీజీ కనెక్షన్ తో లింక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: