ఓ వైపు క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుగోనేందుకు ప్ర‌పంచ దేశాలు కృషి చేస్తుండ‌గా కొద్ది రోజుల క్రితం బయ‌ట‌ప‌డినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వైర‌స్ మ్యుటేష‌న్ గురించి ఆందోళ‌న మొద‌లైన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి వైర‌స్‌లో మార్పులు చోటు చేసుకుంటే వ్యాక్సిన్ ప‌నిచేయ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని శాస్త్ర‌వేత్త‌లు పెద‌వి విరిచారు. అయితే మ్యుటేష‌న్ జ‌రుగుతున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా ఒక‌ట్రెండు చోట్ల నుంచి మాత్ర‌మే ప‌రీక్ష‌ల నివేదిక‌లు డ‌బ్ల్యూహెచ్‌వోకు అందాయి. ముందుగా మలేషియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన  విషయాన్ని వెల్లడించారు. సార్స్‌ సీఓవీ -2కు చెందిన కొత్త జన్యువును వారు గుర్తించిన‌ట్లుగా పేర్కొన్నారు.



 ప్రస్తుతం ఉన్న వైర‌స్ కంటే కూడా ఇది పదిరెట్లు ఎక్కువగా కరోనా వైరస్‌ను వ్యాప్తించెందించగలదని తేల్చారు. దీంతో కొవిడ్‌ -19 మ్యుటేషన్‌ జరుగుతున్నది అనే ఊహాగానాలకు ఇది బలం చేకూర్చింది.బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం... ‘డీ614జీ’ అనే జన్యువు ఒక క్లస్టర్‌లోని 45 కేసులలో కనీసం మూడు కేసులలో ఉన్నట్లు గుర్తించారు. దీనివ్యాప్తి ఇండియా నుంచి తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్‌ యజమాని నుంచి ప్రారంభమైనట్లు తేల్చారు. మలేషియాకు వచ్చిన అతడు 14 రోజుల హోంక్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించగా, అతడికి జైలుశిక్ష, జరిమానాకూడా విధించారు. ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్‌లో కూడా ఈ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.



అయితే ఇదే  అంశంపై ఆయా దేశాల‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు తీవ్రంగా ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. వైర‌స్ మ్యూటేష‌న్ అనే అంశంపై అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్  సైంటిస్టులు 84 దేశాలకు చెందిన 27 వేల మందిపై అధ్య‌య‌నం చేశారు. 18,514 వైరస్ జీనోమ్లను సీక్వెన్స్ చేసి చూశారు. అయితే ఈ అధ్య‌య‌నంలో పెద్దగా మ్యుటేషన్లు లేవని తేలినట్లుగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వుహాన్లో మహమ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టి నుంచి ఇప్పటిదాకా వైరస్ జీన్స్లలో మార్పులు జరిగింది చాలా తక్కువగా ఉంద‌ని కూడా గుర్తించారు. మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించక ముందు మాత్రం మార్పులు క‌నిపించిన త‌ర్వాత మార్పులు క‌నిపించ‌డం లేద‌ని తెలిపారు. ఈ తాజా అధ్య‌య‌నంలోని విష‌యాల‌తో ప్ర‌పంచ దేశాలు ఊప‌రి పీల్చుకుంటున్నాయి. వ్యాక్సిన్ ప‌ని చేయ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డిన‌ట్ల‌యింద‌ని, ఇక క‌రోనాకు క‌ళ్లెం ప‌డిన‌ట్లేన‌ని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: