క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధిక‌మ‌వుతుండ‌టంతో చిరు ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న జ‌నం ముందు జాగ్ర‌త్త‌గా సొంతుళ్లకు పయ‌న‌మైపోతున్నారు. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం.. వెరసి హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం వలసొచ్చిన వారంతా తిరిగి సొంతూళ్ల బాట పట్టారు. పూర్తిగా స్థిరపడిన వారు మాత్రమే ఉండటానికి మొగ్గు చూపుతుండగా.. అద్దె ఇళ్లలో ఉంటూ.. ఆదాయం కోల్పోయిన వారు నగరంలో ఖర్చులు భరించలేకపోతున్నారు. సొంతూరు వెళ్తే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చనే ఉద్దేశంతో నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో టు-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.


గతంలో నగరంలో టూ లెట్ బోర్డ్ కనపించాలంటే... గల్లీ గల్లీ తిరగాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ఐదు, పది ఇళ్ల కో టూ లెట్ బోర్డ్ దర్శనమిస్తోంది. కరోనా కారణంగా చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలామంది తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు.. చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఏ గల్లీలో చూసినా... టూ లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పరిస్థితులను తలకిందులు చేసింది కరోనా రక్కసి. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ మొదలుకావడంతో బతుకు జీవుడా అంటూ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు కిరాయిదారులు.


 కరోనా పుణ్యామని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అద్దెల ధరలు దిగొచ్చాయి. ఎక్కడా చూసినా అన్ని చోట్ల టూ-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కరోనా దెబ్బకు సిటీలో ఉపాధి కోసం వచ్చినవారంతా తిరిగి ఇంటిబాట పట్టేశారు. దాంతో అద్దెకు గదులన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు కరోనా భయంతో ఉన్నచోట నుంచి అద్దె ఇళ్లు మారాలన్నా వణికిపోతున్నారు. అమ్మో… ఉన్నచోటే నయం.. కొన్నాళ్ల వరకు ఇళ్లు మారే ప్రయత్నం చేయకపోవడమే మంచిదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: