
ఇప్పటివరకు ఈ పథకంలో చేరిన వారి సంఖ్య 21 లక్షల మందికి పైగా ఉన్నారని తెలుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు అన్నిటిని ప్రముఖ బీమా రంగ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా lic డబ్బులు చెల్లిస్తుందట. అయితే ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి కుదరదు. ఈ పధకంలో చేరాలంటే వాళ్ళు తప్పనిసరిగా రైతులు అయి ఉండాలి.అంటే వ్యవసాయం చేసే వాళ్లే అయి ఉండాలి. అందరు ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం లేదు.మహిళా రైతులు కూడా స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.అయితే ఇందులో చేరిన వారు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
60 ఏళ్ళు వచ్చే వరకు కట్టాలి.వయసుని బట్టే కట్టే ప్రీమియంలో మార్పు ఉంటుంది.అలాగే ఈ స్కీమ్ లో చేరడానికి మీరు ఎటువంటి డబ్బులు కట్టవలిసిన పని లేదు.ఉచితంగానే ఈ స్కీమ్ లో చేరవచ్చు. అలాగే ఈ స్కీమ్ లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అది ఏంటంటే ఒకవేళ మీరు ఎప్పుడన్నా డబ్బులు కట్టలేక స్కీమ్ నుంచి మధ్యలోనే తప్పుకోవాలనుకుంటే మీ డబ్బులు మీకు వెనకకు తిరిగి ఇచ్చేస్తారు.అలాగే స్కీమ్ లో ఉన్నవాళ్లు ఆకస్మాత్తుగా చనిపోతే వారి జీవిత భాగస్వామికి సగం డబ్బులు కూడా ఇస్తారు.. మరి ఇన్ని లాభాలు ఉన్న ఈ స్కీమ్ లో తప్పకుండా మీరు కూడా జాయిన్ అవ్వండి.. !!