ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలు.. సమస్యలతో బాధపడుతున్న ప్రజలకోసం..  నిస్సహాయులకు సహాయం చేయడం కోసం ఏర్పడిన సంస్థ రెడ్ క్రాస్. ప్రతి సంవత్సరం మే 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా నిస్సహాయంగా ఉన్న ఎంతో మందికి సహాయం చేసే వాలంటీర్ల  గౌరవార్థం రెడ్క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతే కాదు మే 8వ తేదీన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీని స్థాపించిన హెన్రి దూనంట్ జయంతి కావడం గమనార్హం. రెడ్ క్రాస్  కమిటీని స్థాపించిన హేన్రి దూనంట్ 1863 మే 8వ తేదీన జన్మించారు. ఈయన సమస్యల్లో ఉన్న పేద ప్రజలకు నిస్సహాయులకు సహాయం చేసేందుకు రెడ్ క్రాస్ కమిటీని ప్రారంభించారు  మొదటగా స్విట్జర్లాండ్లోని జెనీవాలో రెడ్ క్రాస్  కమిటీని ప్రారంభించగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ కమిటీ విస్తరించి పోయింది.




 అయితే రెడ్ క్రాస్  కమిటీని ప్రారంభించి ఎంతోమంది నిస్సహాయులకు సేవ చేసినందుకు గాను నోబెల్ బహుమతిని పొందారు అయన. అయితే రెడ్ క్రాస్ కమిటీ ముఖ్య ఉద్దేశం మానవ సేవ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలవడం ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు  అంటువ్యాధులు లాంటి విపత్కర పరిస్థితులు  వచ్చిన సమయంలో మానవతా దృక్పథంతో అందరికీ సహాయం చేసేందుకు ముందుకు రావడం కోసం రెడ్ క్రాస్ సొసైటీ ని ప్రారంభించారు. అయితే కేవలం స్విట్జర్లాండ్లో ప్రారంభించిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలు వాలంటీర్లు సేవా సంస్థలు ఇలా ఎంతో మంది రెడ్ క్రాస్ సొసైటీ లో పేదలకు సేవ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు.



 అందరిలో మానవత్వాన్ని బ్రతికిస్తూ ఇక పేదలకు సహాయం చేయాలి అనే సానుకూల దృక్పథాన్ని తీసుకువస్తూ ఎంతో మందిలో మార్పు తీసుకువచ్చింది రెడ్ క్రాస్ సొసైటీ. ఇక 1984లో రెడ్ క్రాస్ దినోత్సవాన్ని  ప్రతి సంవత్సరం మే 8వ తేదీన జరుపుకునేందుకు అధికారిక ఆమోదించబడింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రెడ్ క్రాస్ కమిటీకి సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ ముందు ఉంటుంది. నిరంతరం ప్రజాసేవలో రెడ్ క్రాస్ కమిటీ లీనమై పోతూ ఉంటుంది.  అందుకే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇష్ట పడుతూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: