రాజధాని తరలింపు విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గేది లేదని మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన రాజధాని అమరావతి కేసు లో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పిందన్నారు.అందుకు తగ్గట్టు ప్రభుత్వం కూడా విశాఖకు కార్యనిర్వహక రాజధాని విశాఖకు  తరలింపుకు,న్యాయ రాజధాని కర్నూలు,శాసన రాజధాని అమరావతిలో ఏర్పాటుపై గల అవసరాన్ని కోర్టు ముందు ఉంచుతామన్నారు.

ఇదిలా ఉంటే  రాజధానికి సంబంధించిన రెగులర్ విచారణ నేటి నుంచి జరుగుతుందని ప్రభుత్వం తరపున  తాము కూడా  భావిస్తున్న వేళ కేసును కొద్ది నెలల పాటు వాయిదా వేయాలని  పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదన్నారు బొత్సా .రాజధాని పై కేసు వేసిన పిటిషనర్లు వాయుదా అడగాల్సి అవసరం ఏమొచ్చిందని వాయిదా వేయమని పిటిషనర్లు అడగడం వెనుక దురుద్ధేశాలు ఉన్నాయా అని బొత్సా ప్రశ్నించారు.

మూడు  రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రబుత్వంగా చాలా స్పష్టంగా ఉందన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ.ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని   ఎలాంటి అనుమానాలకు తావులేదని విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదని తేల్చి చెప్పారు. విచారణ జరుగుతున్న సమయంలో స్వయంగా హాజరై అవసరం అయితే న్యాయ స్థానాన్ని ఒప్పిస్తామని  న్యాయస్థానం ఆదేశాలతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని బొత్సా వెల్లడించారు.భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడ అన్యాయం చెయ్యమని ఇప్పటికే అమరావతికి అనుసంధానంగా గుంటూరు,విజయవాడ గెట్ వే ఎంట్రీకి రహదారిని సిద్ధం చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం అమరావతి పేరుతో కాలయాపన చేసిందనిమూడు రాజధానులెజ్ ఏర్పాటు  చేసి రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు విచారణ ఆలస్యం అయిన కూడా న్యాయపరమైన వివాదాలు దాటుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్నారు.ఏది ఏమైనా మూడు రాజధానులు విషయంలో ప్రబుత్వం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది చూడాలి రాబోయే రోజుల్లో  ఉన్నత న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు వస్తుందో మాత్రం వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: