టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ కుటుంబంపై   కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.  బీజేపీ ఆధ్వర్యంలో కమలాపూర్ లో నిన్న గౌడగర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్రం వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడిందని... మన అందరం పోరాడితేనే రాష్ట్రం వచ్చిందని తెలిపారు.  2014లో ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన కేసీఆర్.. అనేక హామీ లిచ్చారని... కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ? అని ప్రశ్నించారు.  ప్రతి ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానన్న హామీలు నెరవేర్చలేదని నిప్పులు  చెరిగారు.  

కేంద్రం నుంచి ప్రధాని మోడీ 1.7లక్షల ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే ఒక్క ఇల్లైనా కట్టించాడా?  కేరళలో గౌడ సామాజిక వర్గం(ఇడువ) వాళ్లు కొబ్బరి కల్లు తీస్తుంటారన్నారు   కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్.  గౌడసమాజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చాడా?  కేవలం ఎన్నికలప్పుడే ఈ సీఎంకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయి. అప్పుడే హామీలిచ్చి ఆ తర్వాత మర్చిపోతాడని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ ఫ్యామిలీకి ఎటీఎంలా మారిందని... ఈ ప్రాజెక్ట్‌ ద్వారా భారీ ఎత్తులో కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు వెళుతున్నాయని ఆరోపించారు. ఇక సొంత ఫ్యామిలీలో కూడా సీఎం కేసీఆర్‌ కు తీవ్ర వ్యతిరేకత ఉందని...  అవి కూడా ఓ రోజు బయట పడతాయని సంచలన వ్యఖ్యలు చేశారు.  

ఏడేళ్లుగా కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని.... దళితులకు కూడా ఏ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.  ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఐదేళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాలకు, మతాలకు సమాన ప్రాధాన్యమిచ్చి పాలన సాగిస్తున్నారని వెల్లడించారు.  గౌడ(కేరళలో ఇడువ) సామాజిక వర్గానికి చెందిన నాకు కూడా కేంద్రమంత్రిగా మోడీ అవకాశమిచ్చారని... కేంద్ర మంత్రి వర్గంలో 28 మంది నాలాంటి బలహీన వర్గాలకు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలకు స్థానం కల్పించారన్నారు. మోడీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కల్పించారని... దేశంలోని అట్టడుగు వర్గాలకు, దళిత వర్గాలకు అండగా ఉండాలని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలియ జేశారు. .


మరింత సమాచారం తెలుసుకోండి: