తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఎప్పటి నుండో జరగాల్సిన ఈ ఎన్నికలు కరోనా వేవ్ ల తో ఎప్పటికి అప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. దానితో కాస్త తెరపించింది కరోనా అనుకున్నప్పుడు మళ్ళీ ఎన్నికల సంఘం ఉపఎన్నికలు జరపడానికి రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు తమకు ఇప్పుడప్పుడే ఎన్నికలు వద్దని, ఒక పక్క కరోనా, మరో పక్క విషజ్వరాలు, ఇంకో పక్క పండుగ సీజన్ ఇవన్నీ అయ్యాకే చూద్దామని సమాధానం ఇవ్వడంతో ఆ రాష్ట్రాలలో ఎన్నిక వాయిదా పడింది.

అసలు తెలంగాణ పరిస్థితి చూస్తే ఇప్పుడే సాధారణ ఎన్నికలకు జరుగుతున్న హడావుడి నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి నిర్ణయంతో ఆ వాతావరణం అంతా కాస్త చల్లబడ్డట్టే ఉంది. కానీ, పట్టు వీడని విపక్షాలు తమ తమ ప్రచారం చేస్తూనే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ హడావుడి ఉండనే ఉంది. ఇక షర్మిల కూడా తన దీక్షలు కొనసాగిస్తూనే ఉంది. ఇలా ఎన్నికల వాయిదా పడ్డ నిర్ణయం కాస్త నిరాశ పరిచినా, విపక్షాలు మాత్రం వాటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఈ వాయిదా మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోవాలని అధికారపార్టీ తెరాస ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న అననుకూలత ను ఈ గ్యాప్ లో తెరాస సరిచేసుకోడానికి ఈ సందర్భం కలిసొస్తుందని చెప్పాలి.

విపక్షాలతో కలిసినట్టే ఉన్నా, షర్మిల కూడా ప్రజలతో మమేకమై తన పాత్ర తాను నిర్వర్తిస్తుంది. తాజాగా ఎన్నిక వాయిదా పడినా నిరుద్యోగులను నామినేషన్ వేయాల్సిందిగా పిలుపునిచ్చింది. తాను ప్రచారం తదితర బాధ్యతలను భరిస్తానని మాట కూడా ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. అయితే ఈ పిలుపుకు  స్పందన ఎంతవరకు ఉంటుందనేది చెప్పాల్సిన పని లేదేమో. ఇదంతా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నడిపిస్తున్నది తెలిసీ, ఇలాంటి పిలుపులు ఇస్తే దానికి స్పందించడం ఎంత ఎర్రితనమో అక్కడి యువతకు తెలుసనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈమె పార్టీపై పిల్ల కాంగ్రెస్ లేదా ఎవరి తోక పార్టీ అనే నామర్దా ఉన్నంత కాలం ఇలాంటి పిలుపులు ఎన్ని ఇచ్చి స్పందన కోసం ఎదురు చూడటం వెర్రి అనే అనిపించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: