ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపఎన్నికలు గంటికలు మోగాయి. దీనితో ఆయా పార్టీలలో ప్రచార ఉత్సాహం మొదలైంది. విపక్షాలు తమ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నంలో కనీసం ఈ ఉపఎన్నికలలో అయినా గెలిచి చూపించాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అదే తరహాలో అధికార పార్టీ వైసీపీ కూడా తనపావులు కడుపుతూనే ఉంది. గత ఉపఎన్నిక తిరుపతి తరహాలో ప్రస్తుత ఉపఎన్నిక బద్వేల్ అభ్యర్థికి కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. అందుకు బాధ్యతలను ఎంపీ అవినాష్ కు అప్పగించింది ఆ పార్టీ. నేడు అవినాష్ బద్వేల్ కార్యకర్తలు, వివిధ ఇతర నాయకత్వంతో సమావేశం అయి సీఎం జగన్ చెప్పిన దానిని పంచుకున్నారు. ఈ  నేపథ్యంలో ఆయా వర్గాలు చేయాల్సిన కృషిని ఆయన స్పష్టం చేశారు.

ఎవరు కూడా ప్రభుత్వానికి పోటీగా సరిపోయే స్థితిలో లేనప్పటికీ అహంకారంతో కాకుండా కేవలం సేవాభావంతో ప్రచారం లోకి దిగాలని అవినాష్ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. జగన్ ప్రభుత్వం చేసిన, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన మరియు చేస్తున్న అనేక పధకాలను ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ప్రచారం సాగాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్కరైన పథకాలు అందక ఇబ్బంది పడుతుంటే, వారితో సమస్యలను గురించి చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేవలం అభివృద్ధి చేసింది చెప్తూ ప్రచారం సాగితే సరిపోతుందని ఆయన సూచించారు.

ఏపీలో బద్వేల్ ఉపఎన్నికకు ముఖ్యమంత్రి జగన్ ఆయా మంత్రులకు దిశానిర్దేశం చేశాడు. ప్రజలలోకి ఖచ్చితమైన పధకాల అమలును తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. చేసినవి చెప్పి ఓట్లు అడగండి తప్ప చేయనివి కాదని సూచించారు. గత తిరుపతి ఉపఎన్నిక కంటే ఎక్కువ మెజారిటీ ఈ ఉపఎన్నిక(బద్వేల్) లో ఎక్కువ మెజార్టీ రావాలని ఆయా నేతలకు సీఎం జగన్ సూచించారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ కు  సహకరించాలి తప్ప ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగర్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.  అల్లరి మూకలను ఆయా సమయాలలో గొడవలు రేపకుండా చూసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: